న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ బలమైన విధానాలను కలిగి ఉందని, గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు దేశం ఎప్పుడూ తొందరపడని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వాఖ్యానించారు.
పరస్పర లాభదాయకంగా ఉండేనే అందుకు అంగీకరిస్తుందని పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ శనివారం కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించే సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గడం ఖాయమని, కావాలంటే తన వ్యాఖ్యలను రాసి పెట్టుకోవాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.