న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: సంపూర్ణ డిజిటల్ టోలింగ్ పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపులను నిలిపివేయాలని కేంద్ర ప్రభు త్వం యోచిస్తున్నది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే టోల్ లావాదేవీలన్నీ ఫాస్టాగ్, యూపీఐ వంటి ఎలెక్ట్రానిక్ విధానాల ద్వారా మాత్ర మే జరుగుతాయి.
నగదును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. సాంకేతిక ఆధారిత పరిష్కారాల ద్వారా నిర్వాహక సామర్థ్యాన్ని విస్తరించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడం, హైవే మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం వంటి విస్తృత వ్యూహంలో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రస్తుతం ఈ మార్పును అంచనా వేస్తున్నది.