ప్రకటనలే.. పరిష్కారమేదీ?
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సంక్షోభం తీవ్రమైంది. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం వీధుల్లోకి వచ్చిన వందలాది మంది ప్రజలు.. మండుటెండలో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని, 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయంటూ ఎప్పటిలాగే కేంద్రం ప్రకటనలను గుప్పించింది.
- ఇంధనం కోసం ప్రజల అవస్థలు
- మండుటెండలో క్యూలో అరిగోస
- సమస్య పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం
- నిల్వలపై నిజాలు చెప్పడం లేదు
- కొవిడ్ తరహా పరిస్థితి అంటూ చేతులెత్తేసిన ప్రధాని మోదీ
- ఇంధన సంక్షోభంపై చాట్‌బాట్స్ గ్రోక్, చాట్‌జీపీటీ విశ్లేషణ
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సంక్షోభం తీవ్రమైంది. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం వీధుల్లోకి వచ్చిన వందలాది మంది ప్రజలు.. మండుటెండలో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని, 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయంటూ ఎప్పటిలాగే కేంద్రం ప్రకటనలను గుప్పించింది.
కానీ, దేశంలో 9.5 రోజులకు సరిపడా మాత్రమే చమురు నిల్వలు ఉన్నాయని ఆర్టీఐ పిటిషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఏఐ చాట్‌బాట్స్ గ్రోక్, చాట్‌జీపీటీలను పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ఈ విషయంపై సమగ్రంగా విశ్లేషించిన ఆయా ఏఐ ప్లాట్‌ఫామ్స్.. చమురు సంక్షోభం విషయంలో కేంద్రం విఫలమయ్యిందని, సమస్యను పరిష్కరించకుండా ప్రకటనలకే పరిమితమవుతున్నదని తేల్చి చెప్పాయి.
గ్రోక్, చాట్‌జీపీటీ ఏమన్నాయంటే?
- దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాల్లో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలందరూ రోడ్ల మీదికి వచ్చారు. మండుటెండలో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల్లో పడిగాపులు కాస్తున్నారు.
- భవిష్యత్తులో ఇంధన సరఫరా ఉండదేమోనన్న భయంతో గుజరాత్, తెలంగాణ, ఏపీ, యూపీ తదితర రాష్ర్టాల్లోని పలువురు వాహనదారులు క్యాన్లు, బాటిల్స్‌లో పెట్రోల్‌ను నింపుకోవడం వీడియోల్లో కనిపిస్తున్నది.
- అయితే, చమురు నిల్వలు సరిపడా ఉన్నాయంటూ ప్రకటనలు చేస్తున్న కేంద్రం.. బంకులు ఎందుకు మూసివేస్తున్నారో, నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టా ల్సి వస్తుందో మాత్రం చెప్పడంలేదు.
- ఆయిల్ కంపెనీలకు, డీలర్లకు మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేసి చమురు సమస్యను పరిష్కరించడంలో కేంద్రం ఫెయిలయ్యిందనే చెప్పొచ్చు.
- ప్రస్తుతం 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం తాజాగా ప్రకటించింది. అయితే, 9.5 రోజులకు మాత్రమే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ ఆర్టీఐ ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చినట్టు కొన్ని పత్రికల్లో వచ్చింది. దీన్ని విశ్లేషిస్తే, చమురు నిల్వలపై కేంద్రం పూర్తిగా నిజాలు చెప్పడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- చమురు సంక్షోభం విషయంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కొవిడ్ తరహా స్థితికి అందరం సిద్ధంకావాలని ప్రకటించారు. అంటే సమస్యను పరిష్కరించకుండా పూర్తిగా చేతులెత్తేశారా? అనే విమర్శలు కూడా వస్తున్నాయి.
2 నెలలకు సరిపడా చమురు నిల్వలు: కేంద్రం వెల్లడి
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు వదంతులు నమ్మి పెద్దమొత్తంలో చమురును నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. ఒక వైపు హొర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభనతో చమురు సరఫరా నిలిచిపోయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా 40 మంది సరఫరాదారుల నుంచి భారత్‌కు చమురు వస్తూనే ఉందని తెలిపింది.
చమురు సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా దేశ వ్యాప్తంగా ఉన్న శుద్ధి కర్మాగారాలు నూరు శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. భారత్ మొత్తం చమురు నిల్వ సామర్థ్యం 74 రోజుల దేశీయ అవసరాలకు సరిపోతుందని, అయితే ప్రస్తుతం 60 రోజులకు సరిపడా నిల్వలున్నాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

