Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆరుగురు సైనికులు వీరమరణం.. తొలిసారి పేర్లను వెల్లడించిన ప్రభుత్వం
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వేళ ఆరుగురు భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అయితే ఆ అమర జవాన్ల పేర్లను ఇవాళ కేంద్రం వెల్లడించింది. ఆ సైనికుల పేర్లను ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలో రాయనున్నారు. సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్మాన్ సునిల్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, అగ్నీవీర్ మురళీ నాయక్, హవిల్దార్ సునిల్ కుమార్ సింగ్, సురేంద్ర కుమార్ .. ప్రాణాలు కోల్పోయినవారిలో ఉన్నారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ఉగ్రమూకల్ని అంతం చేసేందుకు భారత సైన్యం గత ఏడాది మే నెలలో ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో ఆరుగురు భారతీయ సైనిక సిబ్బంది మృతిచెందినట్లు ఇవాళ ప్రభుత్వం పేర్కొన్నది. ఆ ఆపరేషన్‌లో వీరమరణం పొందిన ఆ సైనికులు పేర్లను కూడా వెల్లడించారు. దేశ రాజధానిలో ఉన్న జాతీయ యుద్ధ స్మారకంపై ఆ ఆరుగురు సైనికుల పేర్లను చేర్చనున్నట్లు సైన్యం తెలిపింది. మిలిటరీకి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్మాన్ సునిల్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, అగ్నీవీర్ మురళీ నాయక్, హవిల్దార్ సునిల్ కుమార్ సింగ్‌తో పాటు భారతీయ వైమానిక దళానికి చెందిన సురేంద్ర కుమార్ ఉన్నారు.
ఆపరేషన్ సింధూర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వీర సైనికులతో పాటు 2025లో జరిగిన వివిధ మిలిటరీ ఆపరేషన్స్‌లో అమరులైన సైనికుల పేర్లను రిలీజ్ చేశారు. నేషనల్ వార్ మెమోరియల్‌లో ఉన్న త్యాగ చక్ర వద్ద ఆ ఆరుగురు సైనికుల పేర్లను రాయనున్నారు. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద క్యాంపులపై గత ఏడాది మే 7వ తేదీన భారతీయ సైనిక దళాలు అటాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ను పాక్ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో డ్రోన్ దాడులు, షెల్లింగ్, వైమానిక అటాక్‌లు జరిగాయి. రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు భీకర ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మే 10వ తేదీన వార్ ముగిసింది.
🇮🇳 India honours the bravehearts of Operation Sindoor
The names of six soldiers who made the supreme sacrifice during Operation Sindoor have now been officially made public. Their names will also be engraved on a special commemorative brick at the National War Memorial, New… pic.twitter.com/p3lvHvIlfZ
— Raksha Samachar | रक्षा समाचार 🇮🇳 (@RakshaSamachar) June 26, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

