Traffic Crackdown | రంగుల పండుగ హోలీ (Holi)ని దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇక హోలీ సందర్భంగా ముంబై (Mumbai) పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Crackdown) విధించారు. కీలక ప్రదేశాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై భారీగా జరిమానా విధించారు. మొత్తం మార్చి 13, 14 తేదీల్లో 17,495 జరిమానాలు విధించారు. వీటి ద్వారా రూ.1.79 కోట్లు ఫైన్ వేశారు.
హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు గానూ 4,949 కేసులు నమోదయ్యాయి. ఇక మద్యం సేవించి వాహనం నడిపినందుకు గానూ 183 కేసులు, రాంగ్ వే డ్రైవింగ్ చేసినందుకు గానూ 33 కేసులు, వన్ వే కింద 992 కేసులు, ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు గానూ 425 కేసులు, సిగ్నల్ జంపింగ్‌కు 1,942 కేసులు, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు గానూ 826 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా రెండు రోజుల డ్రైవ్‌లో రూ.1.79 కోట్ల విలువైన 17,495 జరిమానాలు విధించినట్లు వివరించారు.
Also Read..
DMK | అప్పుడు ఆయన పుట్టి ఉండరు.. పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేతల విమర్శలు
Donald Trump | ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..!