Donald Trump | ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..!
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తన పాలన ఎలా ఉంటుందో మరోసారి ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. అమెరికాను మళ్లీ ప్రపంచంలోనే నంబర్ వన్‌గా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతన్నారు. ఈ క్రమంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. పలు దేశాలపై భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను స్వదేశాలకు సాగనంపారు. అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు వంటి సంచలన నిర్ణయాలకు తెరలేపిన డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే (Travel Ban) అంశాన్ని ట్రంప్ (Donald Trump) సర్కారు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 41 దేశాల (41 Countries) పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ 41 దేశాలను మూడు గ్రూపులుగా విభజించి.. ఆయా దేశాలపై ప్రయాణ పరిమితులను విధించనునట్లు తెలిసింది. మొదటి గ్రూప్‌లో అఫ్గానిస్థాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తరకొరియా వంటి పది దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేశాల పౌరులకు వీసాల జారీ పూర్తిగా నిలిపివేయనున్నారు.
ఇక, రెండో గ్రూప్‌లో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలున్నాయి. ఈ దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ దేశాలకు చెందిన పౌరులకు పర్యాటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులు కల్పించే అవకాశాలున్నాయి.
మూడో గ్రూప్‌లో పాకిస్థాన్, భూటాన్ సహా మొత్తం 26 దేశాలు ఉన్నట్లు తెలిసింది. ఈ దేశాలు తమ భద్రతా తనిఖీలను మెరుగుపరుచుకునేందుకు 60 రోజుల గడువు ఇస్తారు. ఆ సమయంలో లోపాలన పరిష్కరించుకోవచ్చు. ఒక వేళ ఇచ్చిన గడువులోపు ఆ దేశాలు ఆ ప్రయత్నాలు చేయడంలో విఫలం అయితే.. అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఈ మేరకు అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అయితే, ట్రావెల్ బ్యాన్పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read..
South African ambassador | యూఎస్‌లో దక్షిణాఫ్రికా రాయబారిపై ట్రంప్ సర్కార్ బహిష్కరణ వేటు
Train Hijack | 214 మంది పాక్ సైనికులను హతమార్చాం : బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన
Tesla Showroom | ఎలాన్ మస్క్‌పై తీవ్ర వ్యతిరేకత.. టెస్లా షోరూంపై కాల్పులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

