Train Hijack | పొరుగుదేశం పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Train Hijack) నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది పాక్ సైనికులను (Pakistani Army) హతమార్చినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) తాజాగా ప్రకటించింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి విధించిన 48 గంటల గడువు శుక్రవారంతో ముగిసినట్లు పేర్కొంది. పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది పాక్ సైనికులను చంపేసినట్లు ప్రకటించింది.
క్వెట్టా నుంచి పెషావర్ (Peshawar) వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Jaffar Express)ను బలోచిస్తాన్ రెబల్స్ మంగళవారం హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 440 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో 21 మంది పౌరులు, నలుగురు సైనికులు మృతిచెందారు. అయితే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన తీవ్రవాదులందిరినీ హతమార్చి బందీలను విడుదల చేసినట్టు పాకిస్థానీ సైన్యం బుధవారం ప్రకటించింది. 30 గంటల ఆపరేషన్ తర్వాత 33 మంది తీవ్రవాదులను కాల్చివేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు పాకిస్థానీ సైనిక సిబ్బంది కూడా మరణించారని పాక్ ప్రకటించింది.
జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఘటనలో తమ ఆపరేషన్ ముగిసిందని పాక్ సైన్యం చేసిన ప్రకటనను బలూచ్ లిబరేషన్ ఖండించింది. తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పాకిస్థానీ సైన్యం ప్రయత్నిస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. ఖైదీల మార్పిడికి తాము ప్రతిపాదించగా పాకిస్థాన్ చర్చలకు నిరాకరించి తన సైనికులను గాలికి వదిలేసిందని గ్రూపు ఆరోపించింది. యుద్ధ క్షేత్రంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు స్వతంత్ర జర్నలిస్టులను పంపాలని పాక్ ప్రభుత్వానికి బీఎల్ఏ ప్రతిపాదించింది. తమ సభ్యులకు, పాకిస్థాన్ భద్రతా సిబ్బందికి మధ్య భీకర పోరు కొనసాగుతోందని, పాకిస్థానీ దళాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయని బీఎల్ఏ వెల్లడించింది. పాకిస్థానీ సైన్యం యుద్ధ రంగంలో గెలిచింది కాని బందీలను విడుదల చేసింది కాని లేదని బీఎల్ఏ తెలిపింది.
Also Read..
వైఫల్యం మీదైతే.. నిందలు మా పైనా?
Train Hijack: బలోచిస్తాన్లో రైలు హైజాక్.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్