Jaffar Express: పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్.. 16 మంది ఉగ్రవాదులు హతం.. 104 మంది ప్రయాణికుల రెస్క్యూ
Jaffar Express: పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ అయిన ఘటనలో 16 మంది ఉగ్రవాదుల్ని హత మార్చారు. బలోచిస్తాన్ ప్రాంతంలోని మస్కఫ్ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే 104 మంది ప్రయాణికుల్ని రక్షించారు. ఆ ట్రైన్లో సుమారు 450 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు.
క్వెట్టా: పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్ ప్రాంతంలో ఉన్న బోలన్ జిల్లాలో ఉగ్రవాదులు జాఫర్ ఎక్స్‌ప్రెస్(Jaffar Express) రైలును హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ రైలులో సుమారు 450 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. అయితే భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో.. సుమారు 16 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 104 మంది ప్రయాణికులను ప్రస్తుతం రెస్క్యూ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 9 బోగీలతో వెళ్తున్న రైలులో దాదాపు 450 మందికిపై గా ప్రయాణికులు ఉన్నారు. క్వెట్టా నుంచి పెషావర్‌కు రైలు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు అటాక్ చేశారు.
ఇవాళ ఉదయం జాఫర్ రైలు నుంచి 57 మంది ప్రయాణికుల్ని రెస్క్యూ చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు. వాళ్లను క్వెట్టాకు తరలించారు. ఇక మరో 23 మంది ప్రయాణికుల్ని మాచ్‌కు పంపించారు. రెస్క్యూ చేసిన వారిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. బంధీలుగా ఉన్న ప్రయాణికుల్ని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. భద్రతా దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాక, మిలిటెంట్లు చిన్న గ్రూపులుగా విడిపోయారని అధికారులు తెలిపారు. గాయపడ్డ 17 మంది ప్రయాణికుల్ని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు.
జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేందుకు మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తులు శాటిలైట్ ఫోన్లతో అంతర్జాతీయ కాల్స్ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. కొండలు, లోయ ప్రాంతాలు కావడంతో.. రైలు హైజాక్ అయిన ప్రాంతానికి వెళ్లడానికి భద్రతా దళాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న మాస్టర్‌మైండ్‌తో రైలు హైజాక్ నిందితులు టచ్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎక్కువ శాతం మహిళలు, చిన్నారుల్ని బంధీలుగా వాడుకుని బెదిరిస్తున్నట్లు చెప్పారు. రైలులో సాధారణ ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపారు.
బాంబులతో రైల్వే ట్రాక్‌ను పేల్చిన తర్వాత.. ఇంజిన్ డ్రైవర్‌పై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. అయితే మస్కఫ్ టన్నెల్‌కు సమీపంలో రైలు ఆగిపోయినట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో రైలును ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు.
పంజాబ్, సింధ్ ప్రాంతాల నుంచి బలోచిస్తాన్ వెళ్లే అన్ని రైళ్లను రెస్క్యూ ఆపరేషన్ వల్ల రద్దు చేసినట్లు పాకిస్థాన్ రైల్వే శాఖ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

