South African ambassador | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా సంచలనమే. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. తన పాలన ఎలా ఉంటుందో మరోసారి ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. పలు దశాలపై భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించారు. అమెరికాలో అక్రమంగా నివిస్తున్న వలసదారులను స్వదేశాలకు సాగనంపిన ట్రంప్.. ఇప్పుడు విదేశాలకు చెందిన రాయబారులపై బహిష్కరణ వేటు వేస్తున్నారు.
యూఎస్‌లోని దక్షిణాఫ్రికా (South Africa)కు చెందిన రాయబారి ఇబ్రహీం రసూల్ (Ebrahim Rasool)పై ట్రంప్ సర్కార్ తాజాగా వేటు వేసింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) ఎక్స్ వేదికగా వెల్లడించారు. దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్ ఈ గొప్ప దేశంలో ఉండేందుకు ఆహ్వానించదగిన వ్యక్తి కాదు అని అన్నారు. ఆయన అధ్యక్షుడు ట్రంప్‌ను ద్వేషించే వ్యక్తి అని, ఒక జాతి విద్వేష రాజకీయ నాయకుడు అని, దీనిపై ఆయనతో చర్చించాల్సింది ఏమీ లేదు అని రూబియో పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రసూల్.. ట్రంప్ పరిపాలనపై వ్యతిరేకంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ కారణంగానే ఆయనపై బహిష్కరణ వేటు వేసినట్లు తెలుస్తోంది. రసూల్‌పై బహిష్కరణ వేటుపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇబ్రహీం రసూల్ 2010 నుంచి 2015 వరకు అమెరికాలో దక్షిణాఫ్రికా రాయబారిగా పనిచేశారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తిరిగి ఆ పదవిని చేపట్టారు.
Also Read..
Train Hijack | 214 మంది పాక్ సైనికులను హతమార్చాం : బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన
Tesla Showroom | ఎలాన్ మస్క్‌పై తీవ్ర వ్యతిరేకత.. టెస్లా షోరూంపై కాల్పులు
Sunita Williams | నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9.. భూమిపైకి రానున్న సునీతా విలియమ్స్ !