Tesla Showroom | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla)కు చెందిన షోరూం (Tesla Showroom)పై మరోసారి కాల్పులు జరిగాయి. అమెరికాలోని ఒరెగాన్‌లో ఉన్న టెస్లా డీలర్‌షిప్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. గురువారం ఉదయం 4:15 గంటల సమయంలో దుండగులు దాదాపు 12 సార్లు గన్ పేల్చి అలజడి సృష్టించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. షోరూంలోని కొన్ని కార్లు, కిటికీలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. అయితే, టెస్లా షోరూంపై కాల్పులు జరగడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చి 6వ తేదీన కూడా ఇదే షోరూంపై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి.
ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) శాఖ అధిపతిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుతో టెస్లాను బహిష్కరించాలంటూ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు.
Also Read..
Sunita Williams | నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9.. భూమిపైకి రానున్న సునీతా విలియమ్స్ !
Genocidal Acts | పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ లైంగిక హింస: ఐక్యరాజ్య సమితి
China | వేగంలో చైనా రాకెట్ స్లెడ్ రికార్డ్.. విజయవంతంగా పరీక్షించిన డ్రాగన్