China | బీజింగ్, మార్చి 14: రాకెట్ సైన్స్‌లో చైనా అద్భుత విజయాన్ని సాధించింది. అత్యాధునిక డ్యూయల్-ట్రాక్ రాకెట్ స్లెడ్‌ను విజయవంతంగా పరీక్షించి వేగంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అత్యాధునికమైన ఈ ట్రాక్ విమానయానంతోపాటు రోదసి, ఆయుధ రంగాలకు సంబంధించిన పరీక్షలకు ఎంతో ఉపకరిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికను కలిగి ఉన్న ఐదు దేశాల్లో చైనా ఒకటిగా నిలిచింది.
ఆసియాలో తొలి డ్యూయల్-ట్రాక్ రాకెట్ స్లెడ్ సిస్టమ్ ఇదేనని చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక వార్తాపత్రిక ‘పీపుల్స్ డైలీ’ వెల్లడించింది. 8 టన్నుల బరువైన వస్తువు వేగాన్ని ఈ ట్రాక్ కేవలం 5 సెకండ్లలో సూపర్సోనిక్ స్థాయికి పెంచగలదని పేర్కొంది. 6 కిలోమీటర్ల పొడవైన ఈ రాకెట్ స్లెడ్ ట్రాక్‌పై ఇటీవల ఓ ప్రొటోటైప్ ఎయిర్‌క్రాఫ్ట్ గంటకు 2,800 కి.మీ (మాక్ 2.28) వేగంతో దూసుకుపోయినట్టు తెలిపింది.