Genocidal Acts | జెనీవా, మార్చి 14: హమాస్‌తో యుద్ధం వేళ ఇజ్రాయెల్‌పై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆరోపణలు చేసింది. గాజా స్ట్రిప్‌లో యుద్ధం సందర్భంగా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ లైంగిక హింసకు పాల్పడిందని ఐరాసకు చెందిన మానవ హక్కుల నిపుణులు గురువారం ఆరోపించారు. ‘గాజా ప్రాంతంలో హమాస్‌తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ లైంగిక, పునరుత్పత్తి, ఇతర లింగ ఆధారిత హింసకు క్రమబద్ధంగా పాల్పడింది’ అని వారు తెలిపారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌లు దాడి చేసిన అనంతరం ఇంత తీవ్ర స్థాయి ఆరోపణలు ఎన్నడూ రాలేదు. అయితే ఇజ్రాయెల్ వ్యతిరేక చర్యల్లో భాగంగానే ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ ఇలాంటి ఆరోపణలు చేసిందని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ అన్నారు. అయితే వారు దీనిపై తాము కనుగొన్నదేమిటో వివరించ లేదని ఆయన విమర్శించారు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడి అనంతరం ఐరాస మానవ హక్కుల కమిషన్ యుద్ధం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి, దానిపై నివేదిక సమర్పించింది.