ముంబై : కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చనే స్ఫూర్తి నింపే వీడియోను (Viral Video) ముంబై పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబై నగరంలో నిలిచిపోయిన బస్‌ను ప్రయాణీకులంతా ఏకమై ముందుకు తోసిన వీడియోను పోలీసులు ట్విట్టర్లో షేర్ చేశారు. తొలుత ఈ వీడియోను మెధో అనే యూజర్ షేర్ చేశారు.
Good morning, So this is the precious moment when those people ignoring the busy schedule and helping eachother for a moment, Doest matter how much you late or upto but helping eachother is all we do!!@MumbaiPolice @mybmc @TOIMumbai @narendramodi @abpmajhatv @BBCHindi @ABPNews pic.twitter.com/phE5yvxtMB
— medoh (@medohh777) April 29, 2023
ఈ క్లిప్‌లో రోడ్డుపై నిలిచిపోయిన బెస్ట్ బస్‌ను పలువురు ప్యాసింజర్లు తోస్తుండటం కనిపిస్తుంది. ఈ వీడియో కల్ఇప్ ముంబైకర్ల స్ఫూర్తికి గొప్ప ఉదాహరణలా నిలిచింది. ముంబై శక్తి ప్రతి ముంబై వాసి చేతిలో ఉంది..అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియా యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది.
ప్రయాణీకులు ఒక్కటై వాహనాన్ని ముందుకు తోసిన తీరు స్ఫూర్తి నింపేలా ఉందని పలువురు యూజర్లు ప్రశంసించారు. ముంబైని ఒక్కటిగా చేసేవి ఇలాంటివే అని ఓ యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. అందరం ఒక్కటిగా నిలిస్తే ఏమైనా సాధించగలమని మరో యూజర్ రాసుకొచ్చారు. ఇలాంటివి ముంబైలోనే కనిపిస్తాయని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More