Viral Video | చెత్త నుంచి సోలార్ వాహనం తయారీ : సెవన్ సీటర్ వీడియోను షేర్ చేసిన హర్ష్ గోయంకా
భారత్‌లో వినూత్న రీతిలో విజయాలు సాధిస్తూ నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్న ఇన్నోవేటర్ల వీడియోలను (Viral Video) పోస్ట్ చేసి ఆలోచన రేకెత్తించే పారిశ్రామిక వేత్త హర్ష్ గోయంకా తాజా వీడియోతో ముందుకొచ్చారు.
న్యూఢిల్లీ : భారత్‌లో వినూత్న రీతిలో విజయాలు సాధిస్తూ నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్న ఇన్నోవేటర్ల వీడియోలను (Viral Video) పోస్ట్ చేసి ఆలోచన రేకెత్తించే పారిశ్రామిక వేత్త హర్ష్ గోయంకా తాజా వీడియోతో ముందుకొచ్చారు. చెత్త నుంచి ఏడుగురు ప్రయాణించే సోలార్ వాహనాన్ని ఓ వ్యక్తి తయారుచేయగా ఈ ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను బిజినెస్ టైకూన్ హర్ష్ గోయంకా ట్విట్టర్లో షేర్ చేశారు.
So much sustainable innovation in one product – produced from scrap, seven seater vehicle, solar energy and shade from the sun! Frugal innovations like this make me proud of our India! pic.twitter.com/rwx1GQBNVW
— Harsh Goenka (@hvgoenka) April 29, 2023
స్కూటర్‌ను తలపించే ఈ వాహనం పైభాగంలో సోలార్ ప్యానెళ్లను అమర్చారు. ఈ వీడియోలో సెవన్ సీటర్ వాహనాన్ని ఓ వ్యక్తి నడపడం కనిపిస్తుంది. వ్యర్ధాల నుంచి ఈ వాహనం ఎలా తయారుచేశాననేది ఆ వ్యక్తి వివరించడం ఈ వైరల్ క్లిప్‌లో చూడొచ్చు. ఈ వాహనంపై సోలార్ ప్యానెళ్లు ఉండటంతో ఎండాకాలంలో ప్రయాణీకులకు వేడి తగలకుండా కాపాడుతుంది.
ఇలాంటి ఆవిష్కరణలు మన భారత్‌కు గర్వకారణమని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 1.44 లక్షల మంది వీక్షించారు. ఈ ఆవిష్కరణను చేపట్టిన వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. అతడి ట్యాలెంట్ అద్భుతమని మెచ్చుకున్నారు. ఇలాంటి వ్యక్తిని నియమించుకుని బడా కంపెనీలు ఈ తరహా వాహనాలను గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించేందుకు అభివృద్ధి చేయాలని పలువురు యూజర్లు రాసుకొచ్చారు.
Read More
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

