Patang Movie | టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. టాలీవుడ్లో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ అందుకున్న ‘పతంగ్’ (Patang) చిత్రంపై భారీ ఆఫర్ను ప్రకటించాడు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ‘పతంగ్’ చిత్రాన్ని మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు సందీప్ కిషన్ ఏకంగా 500 సినిమా టికెట్లను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ అనూహ్య నిర్ణయంతో సామాన్య ప్రేక్షకులు సైతం థియేటర్లకు వెళ్లి సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం కలిగింది. సినిమా పట్ల సందీప్ చూపిస్తున్న ఈ ప్యాషన్ పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు సినిమా వినోదంతో పాటు, కడుపునిండా భోజనం చేసేందుకు కూడా సందీప్ అదిరిపోయే ప్లాన్ చేశారు. ‘పతంగ్’ సినిమా టికెట్ చూపించిన వారికి తెలుగు రాష్ట్రాల్లోని అతడి ప్రసిద్ధ ‘వివాహ భోజనంబు’ (Vivaha Bhojanambu) రెస్టారెంట్లలో బిల్లుపై 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభించనున్నట్లు తెలిపాడు. సినిమా చూసిన ప్రేక్షకులు ఫిజికల్ టికెట్ లేదా ఆన్లైన్ బుకింగ్ స్క్రీన్ షాట్ చూపిస్తే చాలు. హైదరాబాద్ పాతబస్తీ సంస్కృతిని, గాలిపటాల పండుగ నేపథ్యంలో సాగే భావోద్వేగాలను ఈ చిత్రం అద్భుతంగా ఆవిష్కరించింది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమా అలరిస్తోంది. మరోవైపు ఆది నటించిన శంబాల సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ‘వివాహ భోజనంబు’ (Vivaha Bhojanambu) రెస్టారెంట్లలో భోజనం చేస్తే వారికి 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభించనున్నట్లు సందీప్ తెలిపాడు.
I always believe in supporting small films that come with big heart ❤️
Great initiative — 500 free tickets for Patang 👏🎬#Patang pic.twitter.com/o4LwVNohX2— Anbu Raj (@Catch_anbu) December 27, 2025