Watch: చిన్న జంతువులను ఇబ్బంది పెట్టిన ఒరంగుటాన్.. అవి ఏం చేశాయంటే?
Viral video | చిన్న జంతువులైన రెండు నీటి కుక్కలను (otters) ఒరంగుటాన్ (Orangutan) ఇబ్బంది పెడుతుంది. జూలోని నీటి కొలను పక్కన ఉన్న వాటిని పచ్చగడ్డితో కొట్టి కవ్విస్తుంది. దీంతో ఆ రెండు జంతువులు ఒక్కసారిగా ఆ ఒరంగుటాన్ మీదకు దూసుకెళ్లాయి.
వాషింగ్టన్: సాధారణంగా జంతువుల చేష్టలు ఆసక్తిగా ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు వినోదం కలిగిస్తాయి. దీంతో జంతువులకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అలాంటి ఒక వీడియో (Viral Video) తాజాగా ఇంటర్నెట్లో సందడి చేస్తున్నది. చిన్న జంతువులైన రెండు నీటి కుక్కలను (otters) ఒరంగుటాన్ (Orangutan) ఇబ్బంది పెడుతుంది. జూలోని నీటి కొలను పక్కన ఉన్న వాటిని పచ్చగడ్డితో కొట్టి కవ్విస్తుంది. దీంతో ఆ రెండు జంతువులు ఒక్కసారిగా ఆ ఒరంగుటాన్ మీదకు దూసుకెళ్లాయి. దానిపై దాడి చేసేందుకు యత్నిస్తాయి. ఇది చూసి ఒరంగుటాన్ షాక్ అవుతుంది. అంతేగాక భయంతో వాటి దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అనంతరం అక్కడి నుంచి పారిపోతుంది.
కాగా, బ్యూటెంగ్బైడెన్ అనే యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించవద్దు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే 11 లక్షల మందికిపైగా ఈ వీడియో క్లిప్‌ను చూశారు. నెటిజన్లు కూడా భిన్నంగా స్పందించారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు. ఆ ఒరంగుటాన్ చాలా భయపడిందని ఒకరు వ్యాఖ్యానించారు. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే ఇలాంటి పరిణామాలే జరుగుతాయని కొందరు పేర్కొన్నారు. జంతువుల వల్ల తమకు ఎదురైన అనుభవాలను మరికొందరు గుర్తు చేసుకున్నారు.
Don’t mess with otters.. 😂 pic.twitter.com/GHuIkxnHI7
— Buitengebieden (@buitengebieden) April 26, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

