Eknath Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde)కి హత్య బెదిరింపులు (death threat) వచ్చాయి. షిండే వాహనాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబై పోలీసులకు (Mumbai Police) ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి.
గురువారం మధ్యాహ్నం గోరెగావ్ పోలీసులకు ఓ మెయిల్ వచ్చింది. డిప్యూటీ సీఎం షిండే కారును బాంబుతో పేల్చేస్తాంటూ అందులో బెదిరింపులకు పాల్పడ్డారు. రాష్ట్ర సచివాలయం, జేజే మార్గ్ పోలీస్ స్టేషన్కు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్సే వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రాథమిక విచారణలో ఆ బెదిరింపు మెయిల్ బూటకమని తేలింది. ఈ మెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read..
Deportees | పనామా హోటల్లో నిర్బంధంలో భారతీయులు.. స్పందించిన ఎంబసీ
Swati Maliwal | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార వేదికపై.. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్