ముంబై : ఖాకీ చొక్కా వేసుకుని నెత్తిపై టోపీ పెట్టుకుని దొంగలను పట్టుకునే పోలీసుల్లో కూడా మ్యూజిక్ లవర్స్ ఉంటారు. పోలీసు శాఖలో బ్యాండ్ వాయించేందుకు ప్రత్యేక విభాగమే ఉంటుంది. వీరు ప్రత్యేక పర్వదినాలు, అతిథులు వచ్చిన సందర్భాల్లో స్వాగతం పలుకుతుంటారు. రెడ్ కార్పెట్‌పై అతిథులు నడుస్తుండగా సన్నటి మ్యూజిక్‌ను పన్నీటి జల్లులా వినిపిస్తూ మంత్రముగ్ధులను చేస్తుంటారు. ప్రత్యేక కార్యక్రమాల్లో బ్యాండ్ వాయించి ఆహుతులను అలరిస్తుంటారు.
ముంబైకి చెందిన పోలీస్ బ్యాండ్ మాత్రం.. తాము ప్రత్యేకమంటూ నిరూపించుకునే పనిలో ఉన్నారు. జేమ్స్ బాండ్ (James Bond) సినిమాల్లో చేజింగ్ సమయాల్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని సీన్లో లీనమయ్యేలా చేస్తుంది. అలాంటి హాలీవుడ్ సినిమా స్థాయి మ్యూజిక్‌ను ముంబై పోలీసులు వాయించి.. మన మనసుల్ని దోచుకుంటున్నారు. వీరి మ్యూజిక్ వీడియో ఒకటి సోమవారం సోషల్ మీడియాలో పోస్ట్ అవగా.. ఒకటే రోజులో వేలాది మంది వ్యూస్‌తో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజెన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటూ.. ‘ఏక్ నంబర్ పెర్ఫార్మెన్స్’ అని కామెంట్స్ రాశారు. ఈ వీడియో పోలీసులనే నాణేనికి రెండో వైపు ఎంతటి నైపుణ్యం ఉంటుందో చెప్తున్నదని మరో నెటిజెన్ కామెంట్ చేశారు.
మీరూ ఆ వీడియోను వీక్షించి.. ముంబై పోలీసులను మనసారా అభినందించండి. మన ప్రోత్సాహంతో భవిష్యత్‌లో మరిన్ని మంచి మ్యూజిక్ వీడియోలను మనకు అందిస్తారని ఆశిద్దాం.
మర్మాంగానికి సీల్.. యువకుడు మృతి
ఈ ఆహారాలు తీసుకోండి.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
తాలిబాన్ ఎన్ని ఆయుధాలు ఎత్తుకెళ్లిందో తెలియదు : పెంటగాన్
కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్
ఆఫీస్ బోర్డు తొలగించిన హురియత్ నేతలు.. ఎందుకంటే..?
‘పీఓకే’లో టెర్రరిస్టుల ర్యాలీ.. మరోసారి బయటపడిన పాకిస్తాన్ తీరు
ఇండియాకు వచ్చిన ఈస్ట్ ఇండియా షిప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..