Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
Health tips | నెయ్యి (Ghee) అనేక పోషక విలువలు కలిగిన పదార్థం. కానీ నెయ్యిలో కొవ్వు ఉంటుందని, దీన్ని ఆహారంగా తీసుకోవడంవల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. దాంతో చాలామంది భయంతో నెయ్యి మానేస్తున్నారు. నిజంగానే నెయ్యి తినడంవల్ల బరువు పెరుగుతారా..? అంటే కాదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే నెయ్యితో బరువు పెరుగుతారనడం కేవలం అపోహేనని ఆరోగ్య నిపుణులు (Health Experts) చెబుతున్నారు.
Health tips : నెయ్యి (Ghee) అనేక పోషక విలువలు కలిగిన పదార్థం. కానీ నెయ్యిలో కొవ్వు ఉంటుందని, దీన్ని ఆహారంగా తీసుకోవడంవల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. దాంతో చాలామంది భయంతో నెయ్యి మానేస్తున్నారు. నిజంగానే నెయ్యి తినడంవల్ల బరువు పెరుగుతారా..? అంటే కాదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే నెయ్యితో బరువు పెరుగుతారనడం కేవలం అపోహేనని ఆరోగ్య నిపుణులు (Health Experts) చెబుతున్నారు. పైగా రోజూ మితంగా నెయ్యి తీసుకుంటే బరువును తగ్గించుకునే అవకాశం ఉన్నదంటున్నారు. రోజులో 1 నుంచి 2 టీ స్పూన్లకు మించకుండా నెయ్యి తీసుకుంటే బరువు తగ్గడంతోపాటు ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
నెయ్యితో ప్రయోజనాలు
శక్తి ఉత్పత్తి
రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉండవచ్చు. నెయ్యి శక్తిని ఉత్పత్తి చేసే ఒక పవర్‌హౌస్ లాంటిది. అందుకే మహిళలకు గర్భధారణ సమయంలో నెయ్యి తిన్సాల్సిందిగా సూచిస్తారు.
చర్మానికి మేలు
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మంలోని మాయిశ్చరైజర్‌ను లాక్ చేయడం ద్వారా ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖంలో నిగారింపు, ఆరోగ్యకరమైన చర్మం పొందాలంటే ఆహారంలో నెయ్యిని కలుపుకోవాల్సిందే.
పీరియడ్స్ సమస్యకు చెక్
శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో నెయ్యి సహాయపడుతుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా రాక బాధపడే మహిళలు ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఎముకలు బలోపేతం
నెయ్యిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. అది కాల్షియం శోషణలో సహాయపడుతుంది. తద్వారా దంత క్షయాన్ని నివారించడానికి, అథెరోస్ల్కెరోసిస్ రాకుండా ఎముకలను బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

