‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
అలివిగాని హామీలతో అన్నివర్గాల ప్రజలను రేవంత్ సర్కార్ అంధకారంలోకి నెట్టేసిందని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపహాడ్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం...
– నయవంచన ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్ ఓటరు బుద్ది చెప్పాలి
– బూర్గంపహాడ్, ఎన్పీ రెడ్డిపాలెం విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి దిండిగల రాజేందర్
బూర్గంపహాడ్, అక్టోబర్ 31 : అలివిగాని హామీలతో అన్నివర్గాల ప్రజలను రేవంత్ సర్కార్ అంధకారంలోకి నెట్టేసిందని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపహాడ్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి దిండిగల రాజేందర్ తో కలిసి మాట్లాడారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలిస్తామని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని, రైతు బంధు, రైతు బీమా, ఆరు గ్యారెంటీల అమలు ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నయవంచనకు గురిచేసిన రేవంత్ సర్కార్‌కు గ్రాడ్యుయేట్లు తమ ఓటు ద్వారా బుద్ది చెప్పాలని ఆయన కోరారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు అడిగినా, రైతులపక్షాన మాట్లాడినా అక్రమ కేసులు బనాయించడం, జైల్లో పెట్టించడం, కేసీఆర్‌ను తిట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రజలు, రైతులు, నిరుద్యోగులు అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ సాగుకు కరెంటు లేదు. నీళ్లులేవు. ఇప్పుడు ఏం చేయలేమని చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికలో గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష గులాబీ జెండానే అన్నారు. త్వరలో జరగనున్న ఖమ్మం- నల్లగొండ- వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఓటరు నమోదును గడువులోగా పూర్తి చేసుకోవాలని కోరారు. ఓటరు నమోదుకు బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.

‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
పినపాక నియోజకవర్గంలో అన్నిమండలాల్లో ఓటరు నమోదును బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముమ్మరంగా చేపట్టడం జరుగుతుందని, అన్నివర్గాల పట్టభద్రులను కలుసుకుని ఫారం 18 పత్రాలు అందించి స్వయంగా ఓటరు నమోదు చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని మండలాల్లో ఎన్నికల ఇన్చార్జిలతో కలిసి ఇప్పటికే విస్తృత పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మాజీ సర్పంచ్ సిరిపురం స్వప్న, గోపిరెడ్డి రమణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ, యూత్ నాయకులు గోనెల నాని, బిజ్జం శ్రీనివాసరెడ్డి, సర్వేశ్వరరావు, మేడిగం లక్ష్మినారాయణరెడ్డి, అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బిజ్జం వెంకట్రామిరెడ్డి, దారం కృష్ణారెడ్డి, మండల ముఖ్యనాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

