Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
Suspension | ఉప్పునుంతల మండలం, అయ్యవారిపల్లి గ్రామంలో భూ రికార్డుల నమోదులో అవకతవలకు జరిగినట్లు తేలడంతో తహసీల్దార్ సునీతను జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్ పరిధిలోని ఉప్పునుంతల మండలం, అయ్యవారిపల్లి గ్రామంలో భూ రికార్డుల ( Land Records ) నమోదులో అవకతవలకు జరిగినట్లు తేలడంతో తహసీల్దార్ సునీత ( Tahsildar Sunitha ) ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సస్పెన్షన్ ( Suspension ) ఉత్తర్వులు జారీ చేశారు.
సర్వే నంబర్ 115లో 13.17 గుంటల భూమి అక్రమంగా ఇతరుల పేర్లపై నమోదైనట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో అక్టోబర్ 28న కథనం ప్రచురితమైంది. ఈ కథనం ఆధారంగా అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాను విచారణ అధికారిగా నియమించారు. ఆమె సమగ్ర విచారణ నిర్వహించి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించారు.
విచారణలో భాగంగా పాత రెవెన్యూ రికార్డులు, పహాణీలు, ఖాస్రా, ఆర్ఓఆర్ రికార్డులు, భూ భారతి పోర్టల్‌లోని దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఎన్కంబరెన్స్ వివరాలు పరిశీలించి, భూ రికార్డుల నమోదులో అక్రమాలు జరిగినట్లు అధికారులు నివేదికను కలెక్టర్‌కు అందజేయడంతో తహసీల్దార్‌పై చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

