MS Dhoni | త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు (Jharkhand Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador)గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni ) నియమితులయ్యారు. ఎన్నికల ప్రచారంలో తన ఫొటోను వినియోగించుకునేందుకు ధోనీ సమ్మతించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ తాజాగా వెల్లడించారు. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నట్లు తెలిపారు.
కాగా, 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి (Jharkhand Assembly Elections) రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్ 13న ఎన్నికలు జరగనుండగా.. మిగిలిని 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 29,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది.
Also Read..
MS Dhoni | మరికొన్నేళ్లు ఆటను ఆస్వాదిస్తా.. ఐపీఎల్లో ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోనీ
Pune Test | 255 రన్స్‌కు న్యూజిలాండ్ ఆలౌట్.. టీమ్ఇండియా టార్గెట్ 359
Damodara Raja Narasimha | క్యాన్సర్‌పై అవగాహన లేమితో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు: మంత్రి దామోదర