పుణె: స్వదేశంలో టెస్టుల్లో తిరుగులేని రికార్డు ఉన్న టీమ్ఇండియాను న్యూజిలాండ్ ముప్పుతిప్పలు పెడుతున్నది. ఏరికోరి తయారుచేయించుకున్న స్పిన్ పిచ్‌పై భారత ఆటగాళ్లు చేతులేత్తేయగా కివీస్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నది. పుణెలో జరుగుతున్న రెండో టెస్టుపై (Pune Test) పట్టుబిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 259 రన్స్ చేసిన న్యూజిలాండ్.. భారత్‌ను 156 పరుగులకే పరిమితం చేసింది. ఇక 100 పరుగుల ఆధిక్యంతో తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి 259 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత్ గెలవాలంటే 359 పరుగులు చేయాల్సి ఉంది.
కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్ల చొప్పున తీశారు. ప్రస్తుతం భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. జైస్వాల్, రోహిత్ శర్మ క్రీజ్‌లో ఉన్నారు. మొదటి ఓవర్లోనే 10 రన్స్ చేశారు.