Rahul Gandhi | ఎంపీ అనేది ఓ ట్యాగ్ మాత్రమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో మంగళవారం తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి పర్యటించారు. కలపేటలో ‘సత్యమేవ జయతే’ పేరిట రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ జెండాలకు బదులుగా.. జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ బీజేపీ నా ట్యాగ్, పార్లమెంట్ స్థానం, ఇల్లు తీసుకోవచ్చని.. నన్ను జైలులో పెట్టవచ్చు కానీ వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా ఆపలేదన్నారు. తనను భయపెట్టాలని చూస్తోందన్నారు.
పోలీసులు తన ఇంటికి వచ్చారని, అయితే, ఆ ఇంటిని తీసుకున్నందుకు సంతోషిస్తున్నానన్నారు. ఆ ఇంట్లో నివసించినందుకు నాకు సంతృప్తికరంగా లేదన్నారు. ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. అదానీని ప్రధాని సమర్థించారని ఆరోపించారు. ఉద్యోగాల కోసం సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని తలకిందులు చేసిందని విమర్శించారు. మోదీ ఇంటిపేరు విషయంలో సూరత్ కోర్టు రాహుల్ కాంగ్రెస్‌ని దోషిగా నిర్ధారిస్తూ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌పై అనర్హత వేటు వేసింది. ఈ కేసులో రాహుల్ గాంధీ కోర్టును ఆశ్రయించగా.. బెయిల్‌ను 13 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.