న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.19.33 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలైనట్టు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైనదాంతో పోలిస్తే 9.4 శాతం పెరిగిందని తెలిపింది.
రీఫండ్స్ తగ్గుముఖం పట్టడం, కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు పుంజుకోవడం ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నెల 10 నాటికి నికర కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 14.51 శాతం పెరిగి రూ.8.90 లక్షల కోట్లకు చేరుకోగా, కార్పొరేటేతర ట్యాక్స్ వసూళ్లు 5.91 శాతం అధికమై రూ. 10.03 లక్షల కోట్లకు చేరాయి.