Thanuja Puttaswamy | ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తనూజ .. మా జీవితాలపై కామెంట్లు ఆపండి అంటూ ఫైర్
Thanuja Puttaswamy | 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి, టీవీ ఆర్టిస్ట్ తనూజ పుట్టస్వామి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించారు. బిగ్ బాస్ షో ముగిసి నెలలు గడిచినా ఇప్పటికీ తన వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో తనూజ, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, పవన్ సాయి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది.
Thanuja Puttaswamy | ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి, టీవీ ఆర్టిస్ట్ తనూజ పుట్టస్వామి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించారు. బిగ్ బాస్ షో ముగిసి నెలలు గడిచినా ఇప్పటికీ తన వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో తనూజ, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, పవన్ సాయి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ్ షోలోకి వచ్చిన తర్వాత పవన్ సాయిని తనూజ దూరం పెట్టారనే పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారంపై స్పందించిన తనూజ, బిగ్ బాస్ ముగిసి చాలా కాలమైంది. షోలో పోటీలు, వాగ్వాదాలు ఉండటం సహజం. కానీ బయటకు వచ్చిన తర్వాత మేమంతా మంచి స్నేహితులుగానే ఉన్నాం. ఒకరి సంతోషాల్లో, కష్టాల్లో మరొకరం తోడుగా ఉంటున్నాం. మాకు లేని సమస్యలను సోషల్ మీడియాలో ఎందుకు సృష్టిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.
కళ్యాణ్ పడాలకు ఒక సందర్భంలో సమస్య ఎదురైనప్పుడు తాను ముందుండి సహాయం చేసిన విషయాన్ని కూడా తనూజ వెల్లడించారు. ఆ సమయంలో ముందుగా పవన్ సాయికే ఫోన్ చేసి సహాయం కోరానని, ఆయన కూడా వెంటనే స్పందించి సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. తన కుటుంబానికి కళ్యాణ్ చాలా కాలంగా పరిచయమని, తమ మధ్య మంచి అనుబంధం ఉందని ఆమె స్పష్టం చేశారు. అలాగే పవన్ సాయి, హరిత ప్రస్తుతం తమ తమ పనులతో బిజీగా ఉన్నారని, వారిని అనవసర వివాదాల్లోకి లాగవద్దని కోరారు.సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై తనూజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై తప్పుడు కథనాలు సృష్టించడం సరైన పని కాదని అన్నారు.
నెగిటివ్ కామెంట్లు చేసే వారికి వేరే పని లేకపోతే ప్రశాంతంగా ఉండండి. ఇతరుల జీవితాల్లో అవసరం లేని జోక్యం చేసుకోవద్దు అంటూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తనపై వచ్చే నెగిటివ్ పోస్టులను అభిమానులు తనకు పంపించవద్దని తనూజ విజ్ఞప్తి చేశారు. అలాంటి పోస్టులు చూడడం వల్ల తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకోవాలని, వ్యక్తులపై ద్వేషాన్ని పెంచే వ్యాఖ్యలు చేయకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. తన వ్యక్తిగత సంబంధాల గురించి తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌కు ఒకసారి గట్టిగా సమాధానం ఇచ్చారు.
Thanuja fierce insta live happened today.
All YouTubers or content creators using Thanuja for their views. Their main agenda is to trigger or spread negativity to get attention. This is not limited to other side but from few so called claimed themselves as Thanuja fan content… pic.twitter.com/FEb9IvpEyG
— Sreekar (@granduer143) July 24, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

