Shivraj Chouhan | అసత్యాలు ప్రచారం చేస్తున్న ప్రియాంక, రాహుల్ గాంధీ : శివరాజ్ సింగ్ చౌహాన్
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Chouhan) మండిపడ్డారు.
భోపాల్ : కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Chouhan) మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగే అవినీతి, కుంభకోణాలను ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2జీ స్కామ్, 3జీ స్కామ్ సహా పలు కుంభకోణాలకు ఎవరు పాల్పడ్డారనేది అందరికీ తెలుసని చెప్పారు. బెయిల్‌పై ఉన్నవారంతా అవినీతి గురించి ఆరోపణలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నా అది అవినీతిలో నిండా మునుగుతుందని చౌహాన్ ఆరోపించారు. రెండు సార్లు మధ్యప్రదేశ్ సీఎంగా దిగ్విజయ్ సింగ్ పనిచేయగా ఆయన హయాంలో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. తాము పంటలకు కనీస మద్దతు ధరను ఏ మేరకు పెంచామనేది ప్రియాంక గాంధీకి తెలియదని అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బైగా, భరియ, సహరియ వర్గాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 1000 జమచేసే పధకాన్ని నిలిపివేసిందని ఆయన ఆరోపించారు.
మధ్యప్రదేశ్‌లో తాము పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం లాడ్లి బహన యోజన కింద బాలికలకు రూ. 1250 అందిస్తున్నామని దీన్ని నెలకు రూ. 3000కు పెంచే గ్యారంటీ తాము ప్రజలకు ఇస్తున్నామని చౌహాన్ స్పష్టం చేశారు. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 17న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Priyank Kharge | 8 ఏండ్లలో 5గురు సీఎంలను మార్చిన చరిత్ర బీజేపీది : ప్రియాంక్ ఖర్గే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

