Pune Car accident | మహారాష్ట్రలోని పుణె సిటీలో జరిగిన పోర్షే (Porsche) కారు ప్రమాదం (Pune Car accident) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ బాలుడి తల్లిని (Mother Of Pune Teen) పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడి రక్త నమూనాలు బదులుగా తనవి ఇచ్చినందుకు గానూ ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, శాంపిల్స్‌ను మార్చిన ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను ఇవాళ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఈ కేసులో బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్, తాత సురేంద్ర అగర్వాల్ అరెస్టైన విషయం తెలిసిందే.
కాగా, గత నెల 19న 17 ఏళ్ల మైనర్ ఫూటుగా మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపాడు. దాంతో కారు ఢీకొని ఇద్దరు టెకీలు దుర్మరణం పాలయ్యారు. అయితే రియల్టర్ అయిన మైనర్ తండ్రికి పలుకుబడి ఉండటంతో తన కొడుకును కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించాడు. అందుకోసం ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది తన కుమారుడు కాదని, డ్రైవర్ అని చెప్పాడు.
ఈ మేరకు ససూన్ ఆస్పత్రిలో తన కుమారుడి రక్త నమూనాలను కూడా మార్పించాడు. దాంతో ప్రమాదం జరిగినప్పుడు నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించినా.. బ్లడ్ రిపోర్టుల్లో మాత్రం అతను మద్యం ముట్టనట్లుగా వచ్చింది. ఈ విషయం బయటికి రావడంతో బ్లడ్ శాంపిల్స్ మార్చిన ఇద్దరు డాక్టర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read..
Kangana Ranaut: మేం ప్రధాని మోదీ సైనికులం.. ఓటేసిన కంగనా రనౌత్
Lok Sabha Elections | తొలి రెండు గంటల్లో 11.31 శాతం మేర పోలింగ్
Weather Update | రాష్ట్రంలో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు: ఐఎండీ