Weather Update | రాష్ట్రంలో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు: ఐఎండీ
కొన్నిరోజులుగా ఎండవేడిమి, ఉకపోతతో ఉకిరిబికిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు.. భారత వాతావరణశాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
- పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు
- 2న పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
- జూన్ 5-11 మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి విస్తరించే అవకాశం : హైదరాబాద్ వాతావరణ కేంద్రం
Weather Update | హైదరాబాద్, మే 31 (నమసే తెలంగాణ): కొన్నిరోజులుగా ఎండవేడిమి, ఉకపోతతో ఉకిరిబికిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు.. భారత వాతావరణశాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం నల్లగొండ, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వానలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆదివారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనావేశారు.
అనుకున్న సమయం కన్నా ముందే..
నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాల్లోకి అనుకున్న తేదీ కన్నా ముందే ప్రవేశించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అసోం, బెంగాల్, సికింలోకి ప్రవేశించాయని తెలిపింది. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో కేరళలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. మరో రెండుమూడు రోజుల్లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. జూన్ 5 నుంచి 11 తేదీల మధ్య తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో వానకాలం సీజన్ ప్రారంభమైనట్టేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడటం వంటి కారణాలతో సాధారణం కంటే ఎకువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రేమాల్ తుఫాను వల్లే!
ఈశాన్య భారతంలోకి కూడా పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ తెలిపింది. సాధారణంగా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత జూన్ 5 నాటికి అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపుర్, అసోం రాష్ట్రాలకు చేరుకుంటాయి. ఈసారి రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రేమాల్ తుఫాన్ ఏర్పడింది. తుఫాన్ రుతుపవనాల గమనాన్ని బలంగా లాగిందని, అందుకే నిర్ణీత సమయానికి ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. 2017లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు కూడా రుతుపవనాల ఆగమనానికి కొద్ది రోజుల ముందు బంగాళాఖాతంలో మోరా తుఫాను ఏర్పడింది. ఒకే సమయంలో కేరళ, ఈశాన్య రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకాయి.
150 ఏండ్లుగా రుతుపవనాల సమయంలో మార్పు
ఐఎండీ లెకల ప్రకారం.. కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉన్నది. మొదటిసారి 1918లో మే11న ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న ప్రవేశించాయి. నిరుడు జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి. ఈసారి మే 31న రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. కానీ, ఒకరోజు ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

