మండి: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్(Kangana Ranaut) ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్‌లో మోదీ వేవ్ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 57 స్థానాలకు ఏడో దశ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య ఉత్సవంలో ప్రజలు అందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. హిమాచల్‌లో మోదీ వేవ్ ఉందని, ప్రధాని మోదీ సుమారు రెండు వందల ర్యాలీలు నిర్వహించారని, రెండు నెలల్లోనే 90 ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
బీజేపీ ఇచ్చిన 400 పార్ స్లోగన్‌పై ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. తాము ప్రధాని మోదీ సైనికులమని, హిమాచల్‌లో అన్ని లోక్‌సభ సీట్లను గెలవనున్నట్లు కంగనా వెల్లడించారు. కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్న ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు రనౌత్ కౌంటర్ ఇచ్చారు. ధ్యానం చేయడం ప్రధానికి కొత్త కాదు అని, రాజకీయవేత్తగా మారడానికి ముందు కూడా ఆయన ధ్యానం చేసేవారని, కానీ విపక్షాలకు ఆ ధ్యానం వల్ల సమస్య వస్తున్నట్లు కంగనా ఆరోపించారు. మండి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. హిమాచల్‌లోని కంగ్రా, మండి, హమిర్పుర్, షిమ్లా నియోజకవర్గాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది.
#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha, Kangana Ranaut casts her vote at a polling station in Mandi, for the seventh phase of #LokSabhaElections2024
Congress has fielded Vikramaditya Singh from Mandi Lok Sabha seat. pic.twitter.com/6cggbpGYPV
— ANI (@ANI) June 1, 2024