న్యూఢిల్లీ: స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యాం శరణ్ నేగీ (Shyam Saran Negi) వారం రోజుల క్రితం మరణించారు. 106 ఏండ్ల వయస్సు కలిగిన ఆయన తుదిశ్వాస విడవడానికి మూడు రోజుల ముందు చివరిసారిగా ఓటుహక్కు వినియోగించుకోవడం విశేషం. ఆయనలాగే దేశంలో ప్రస్తుతం వందేండ్లు దాటిన శతాధిక వయోవృద్ధులు సుమారు 2.5 లక్షల మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం ఓటర్ల జాబితాలో 2,55,598 మంది శతాధిక వృద్ధులు ఉడటం గమనార్హం.

ఇక 80 ఏండ్లకు పైబడిన వారిలో 1,83,53,347 మంది ఓట్లరుగా ఉన్నారు. అదేవిధంగా 18 నుంచి 19 ఏండ్ల వయస్కులు 1,52,34,341 మంది ఉండగా, 20 నుంచి 29 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన 20,06,65,436 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారని ఎన్నికల సంఘం పేర్కొన్నది.
