Ranya Rao | కన్నడ నటి (Kannada actor ) రాన్యా రావు (Ranya Rao)ను బెంగళూరు విమానాశ్రయంలో (Bengaluru airport) రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (Directorate of Revenue Intelligence) సోమవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె నుంచి 14.8 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.12.56 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, నగరంలోని లావెల్లే రోడ్డులోని (Lavelle Road) ఆమె నివాసంలోనూ అధికారులు తాజాగా సోదాలు చేపట్టారు.
ఈ సోదాల్లో మరో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు గుర్తించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఆమె వద్ద నుంచి రూ.17.29 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవలే కాలంలో బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన అతిపెద్ద బంగారం అక్రమ రవాణా కేసుల్లో (gold smuggling) ఇది ఒకటి అని డీఆర్ఐ అధికారులు తెలిపారు.
కాగా, 35 ఏళ్ల రన్యారావు కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘మాణిక్య’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘వాఘా’, ‘పటాకీ’ సినిమాల్లో నటించారు. అయితే, రాన్యా ఇటీవతే తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండడంతో ఆమెపై అధికారులు నిఘా పెట్టారు. గత 15 రోజుల్లో ఆమె నాలుగుసార్లు దుబాయ్ వెళ్లడాన్ని గమనించారు. ఎలాంటి అనుమానం రాకుండా.. గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి, తీసుకొస్తున్నట్లు గుర్తించారు. ఆమెపై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ఐపీఎస్ అధికారికి ఆమె దగ్గరి బంధువని వారు తెలిపారు. ఆమె ఎయిర్‌పోర్టులో దిగినప్పుడల్లా తాను డీజీపీ కూతురునని ప్రచారం చేసుకొనేదని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందులో అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Kamal Hassan: అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచండి: కమల్‌హాసన్
Actor Vijay | డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. దీన్ని ఏమాత్రం అంగీకరించం : విజయ్
MK Stalin | తమిళంపై ప్రేమను మాటల్లో కాదు.. చేతల్లో చూపించండి.. కేంద్రంపై సీఎం స్టాలిన్ ఫైర్