చెన్నై: కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌లో మక్కల్ నీధి మయమ్ పార్టీ నేత కమల్‌హాసన్(Kamal Hassan) కూడా పాల్గొన్నారు. మీటింగ్ తర్వాత కమల్‌హాసన్ మీడియాతో మాట్లాడారు. నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతం ఉన్న 453 పార్లమెంటరీ సీట్ల సంఖ్యలో మార్పు ఉండరాదు అని కమల్ పేర్కొన్నారు.
145 కోట్ల జనాభా ఉన్నా.. ప్రస్తుతం 453 మందితో దేశం బాగానే నడుస్తున్నదన్నారు. ఈ సంఖ్య సరిపోతుందన్నారు. ఒకవేళ పార్లమెంటరీ సీట్ల సంఖ్య పెంచాలని అనుకుంటే, అప్పుడు అన్ని ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్రాలే అమలు చేస్తాయని, అలాంటప్పుడు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని కమల్‌హాసన్ డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచాలని భావిస్తే, అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా పెంచాలన్నారు.
#WATCH | Chennai: Actor and Makkal Needhi Maiam chief Kamal Hassan leaves after the all-party meeting over the delimitation issue, chaired by Tamil Nadu CM MK Stalin.
He says, ” My opinion is that this 453 (seats) need not change. Even when it was 145 crore, these 453 members… pic.twitter.com/YqWcJsecIh
— ANI (@ANI) March 5, 2025