Actor Vijay | డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. దీన్ని ఏమాత్రం అంగీకరించం : విజయ్
Actor Vijay | దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ (delimitation) సెగ రాజుకుంటున్నది. వచ్చే పార్లమెంట్ఎన్నికల నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.
Actor Vijay | దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ (delimitation) సెగ రాజుకుంటున్నది. వచ్చే పార్లమెంట్ఎన్నికల నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం అనుసరించబోతున్న ఈ విధానంపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని ఐదు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అంశంపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ (Actor Vijay) తాజాగా స్పందించారు.
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తాజా జనాభా లెక్కల ఆధారంగా ఉంటే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా తమిళనాడుతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు (southern states) జనాభా పెరుగుదలను నియంత్రించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజవర్గాలు విభజించడం సరికాదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఆయా రాష్ట్రాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లోని నియోజకవర్గాల సంఖ్య తగ్గినా.. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్య పెరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అలాంటి పరిస్థితిని తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుందని.. అన్ని పార్టీలతో కలిసి దీనిపై పోరాడతామని విజయ్ స్పష్టం చేశారు.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వద్దు..
కేవలం జనాభా ఆధారంగా దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ సీట్లను (population-based delimitation) నిర్ణయించరాదు అని కేంద్రాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin) ఇటీవలే కోరారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే, దాన్ని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా తమ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు. మా డిమాండ్ చాలా స్పష్టంగా ఉందని, కేవలం జనాభా ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగవద్దు అని, జనాభా నియంత్రణకు దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర చర్యలు తీసుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా ఆ రాష్ట్రాలను శిక్షించవద్దు అని కేంద్రానికి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
ఎక్కువ మంది ఎంపీలు కావాలంటే ఎక్కువ జనాభా ఉండడమే ప్రధాన అర్హతగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణపై తమిళనాడు దృష్టి పెట్టి విజయం సాధించిందని, ఇప్పుడు రాష్ట్రానికి ఈ దుస్థితి రావడానికి అదే కారణమని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. అందుకే పెళ్లి చేసుకుని వెంటనే పిల్లల్ని కనాలని తమిళ ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన సమస్య తమిళనాడు హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిందని, దీన్ని కేవలం రాజకీయ సమస్యగా మాత్రమే పరిగణించలేమని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
Also Read..
MK Stalin | తమిళంపై ప్రేమను మాటల్లో కాదు.. చేతల్లో చూపించండి.. కేంద్రంపై సీఎం స్టాలిన్ ఫైర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

