Today History: మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి 1915 లో సరిగ్గా ఇదే రోజున తిరిగొచ్చారు. ఈయన రాకతో భారత్‌లో స్వాతంత్య్ర సంగ్రామం మరో దశకు చేరుకున్నది. కరమ్‌చంద్ గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థం ఏటా జనవరి 9 ని ప్రవాసీ భారతీయ దివస్‌గా జరుపుకుంటున్నాం.
స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ ఘోఖలే సూచన మేరకు దక్షిణాఫ్రికా నుంచి కరమ్‌చంద్, భార్య కస్తూర్బాతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారు. బొంబాయిలోని అపోలో నౌకాశ్రయానికి చేరుకోగానే.. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు కరమ్‌చంద్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. 1893 లో 24 ఏండ్ల వయస్సులో ఒక కేసులో వాదించేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన అతను అక్కడ 21 సంవత్సరాలు నివసించాడు. తిరిగి వచ్చినప్పుడు అతను 45 సంవత్సరాల అనుభవజ్ఞుడైన న్యాయవాదిగా మారాడు. కరమ్‌చంద్ గాంధీ దక్షిణాఫ్రికాలో అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించాడు. ఇది భారతదేశంలో చర్చనీయాంశంగా మారి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛను పొందాలనే ఆశగా అతడు మారాడు.
స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం, కరమ్‌చంద్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి దేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించారు. కరమ్‌చంద్ కాంగ్రెస్‌లో చేరడానికి ముందు కొందరు శాంతి మార్గాన్ని అవలంబిస్తూ పోరాడుతుండగా.. గాంధీజీ మాత్రం సత్యం, అహింస మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన చేపట్టిన సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాలు బ్రిటిష్ ప్రభుత్వం పునాదిని కదిలించాయి. భారతదేశానికి తిరిగి వచ్చిన రెండేండ్ల తర్వాత, బిహార్‌లోని చంపారన్ నుంచి సత్యాగ్రహం ప్రారంభించాడు. గాంధీజీ స్వదేశానికి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ జరుపుకుంటున్నాం.
2012: వరుసగా రెండోసారి ఫిఫా బాలన్ డీ’ఓర్ అవార్డును గెలుచుకున్న లియోనెల్ మెస్సీ
2002: మైఖేల్ జాక్సన్‌కు అమెరికన్ మ్యూజిక్ ఆధ్వర్యంలో ఆర్టిస్ట్ ఆఫ్ ది సెంచరీ అవార్డు ప్రదానం
1982 : అంటార్కిటికా ఖండానికి చేరిన తొలి భారతీయ యాత్ర బృందం
1970: సింగపూర్‌లో రాజ్యాంగం ఆమోదం
1941: రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లో 6 వేల మంది యూదుల హత్య
1811: ప్రపంచంలో తొలిసారిగా మహిళల గోల్ఫ్ టోర్నమెంట్ ప్రారంభం
1793: ప్రపంచంలో తొలిసారిగా అమెరికాలోని ఫిలడెల్ఫియా నుంచి ఎగిరిన హాట్ ఎయిర్ బెలూన్
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..