Loksabha Elections 2024 : కాంగ్రెస్ వంటి బలహీన ప్రభుత్వాలు ఉంటే దేశం కూడా బలహీనపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం కొడెర్మాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ వంటి బలహీన ప్రభుత్వాలు దేశానికి ఎన్నడూ మేలు చేయవని అన్నారు.
జార్ఖండ్ ప్రజలు ఇలాంటి బలహీన ప్రభుత్వాలను చూశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో దేశంలో తీవ్రవాదం పెచ్చుమీరిందని ఆందోళన వ్యక్తం చేశారు. నక్సలిజం దేశానికి చేటు చేయడమే కాకుండా ఎందరో తల్లుల కలలనూ చిదిమివేస్తుందని మోదీ పేర్కొన్నారు.
తప్పుడు పనులు చేయడంలో జేఎంఎం, కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి ఆదర్శప్రాయులుగా నిలుస్తాయని మండిపడ్డారు. మంత్రి పీఏ సేవకుడి ఇంట్లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయని, నిజజీవితంలో పెద్దసంఖ్యలో నోట్లను తాను చూడలేదని, టీవీలో తొలిసారి చూశానని చెప్పారు. ఇలాంటి వ్యక్తులను రాజ కుటుంబం వెనకేసుకొస్తోందని, ఇలాంటి అక్రమార్కుల సంపదను తాను తవ్వితీస్తానని మోదీ హామీ ఇచ్చారు.
Read More :
Case register | ఓటరును చెంప దెబ్బ కొట్టిన తెనాలి ఎమ్మెల్యేపై కేసు నమోదు