Loksabha Elections 2024 : అవినీతి, కుంభకోణాల్లో పట్టుబడినా కాంగ్రెస్, జేఎంఎం నేతలు సిగ్గులేకుండా ప్రజల ముందుకొస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారు ఏం ముఖం పెట్టుకుని మీ ముందుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ప్రధాని మోదీ శుక్రవారం జార్ఖండ్‌లోని సింగ్భుమ్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజా సమస్యలు కాంగ్రెస్, జేఎంఎం నేతలకు పట్టవని అన్నారు. వారు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎందుకు తహతహలాడుతున్నారని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించారు..మీ మేలు కోసం పనిచేసేందుకని మీరు అనుకుంటే పొరపాటని అన్నారు.
దేశాన్ని యదేచ్ఛగా దోచుకునేందుకే వారు ఢిల్లీలో కొలువుతీరాలని కోరుకుంటున్నారని విమర్శించారు. 2014కు ముందు వారు దేశానికి చేసిందేమీ లేదని, దేశాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. వారి ప్రభుత్వంలో పట్టపగలే ఆదివాదీలను అంతమొందించారని అన్నారు. ఆదివాసీల్లో నేరస్తుల పట్ల భయాన్ని కల్పించాలని వారు కోరుకున్నారని చెప్పారు.
Read More :