Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారానికి తుది రోజు ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పంజాబ్లోని హోషియార్పూర్లో గురువారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. దళితులు, బీసీలు, గిరిజనుల రిజర్వేషన్లను గుంజుకునేందుకు తాను ఎవరినీ అనుమతించబోనని స్పష్టం చేశారు.
విపక్ష కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు రిజర్వేషన్లకు రక్షణ కవచంగా ఉన్న తనపై ఆగ్రహంగా ఉన్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ను కొల్లగొట్టిన ట్రాక్ రికార్డ్ ఆ పార్టీల సొంతమని ఆరోపించారు.
రాజ్యాంగ స్ఫూర్తిని, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తిని విపక్షాలు అవమానిస్తున్నాయని మండిపడ్డారు. దళితులు, ఓబీసీల రిజర్వేషన్లకు కోత విధించి వాటిని ముస్లింలకు కట్టబెట్టాలని ఆ పార్టీలు కోరుకుంటున్నాయని అన్నారు. వారి కుట్రను మోదీ బహిర్గతం చేయడంతో మోదీని నిందించడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు.
Read More :