Rahul Gandhi | నినాదాలు ఇచ్చే కళలో ప్రధాని మోదీ మాస్టర్ డిగ్రీ చేశారు.. కానీ..!
Rahul Gandhi : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) నినాదాలు ఇచ్చే కళలో మాస్టర్ డిగ్రీ చేశారని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (LOP), కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు.
Rahul Gandhi : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) నినాదాలు ఇచ్చే కళలో మాస్టర్ డిగ్రీ చేశారని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (LOP), కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. ప్రధాని తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా (Make in India)’ కార్యక్రమంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మేకిన్ ఇండియా గురించి ప్రధాని మోదీ గొప్పలు చెప్పారని, దేశంలోని తయారీరంగంపై దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదని అన్నారు.
ఈ మేరకు రాహుల్‌గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. మేకిన్ ఇండియాతో దేశంలో తయారీరంగ పరిశ్రమ కొత్తపుంతలు తొక్కుతోందని ప్రధాని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా ప్రభావం ఉంటే తయారీరంగ పరిశ్రమ రికార్డు స్థాయిలో ఎందుకు పడిపోయిందని, నిరుద్యోగ యువత సంఖ్య భారీగా ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు.
ప్రస్తుతం తయారీరంగ పరిశ్రమ వాటా దేశ ఆర్థికవ్యవస్థలో 14 శాతానికి పడిపోయిందని రాహుల్‌గాంధీ చెప్పారు. ఇది రికార్డు స్థాయి పతనమని, 2014 తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీరంగం వాటా ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారని అన్నారు. అంతేగాక చైనా నుంచి భారత్‌కు దిగుమతులు రెండింతలు పెరిగాయని తెలిపారు. ప్రధాని మోదీ నినాదాలు ఇచ్చే కళలో మాస్టర్ డిగ్రీ చేశారు కానీ.. సమస్యల పరిష్కారంలో మాత్రం వెనుకబడ్డారని రాహుల్‌గాంధీ విమర్శించారు.
Read More >>
షాకింగ్ ఘటన.. ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లిన చిరుత
ఈ సీనియర్ భామలకి డిమాండ్ బాగానే ఉంది.. క్షణం తీరిక లేదుగా..!
నేటి నుంచి జులై 15 వరకూ.. అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు నిలిపివేసిన ఎయిర్ ఇండియా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

