Senior Actresses | ఈ సీనియర్ భామలకి డిమాండ్ బాగానే ఉంది.. క్షణం తీరిక లేదుగా..!
Senior Actresses | దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని హీరోయిన్స్ బాగా నమ్ముతారు. వారి క్రేజ్ ఉన్నన్ని రోజులు వరుస పెట్టి సినిమాలు చేస్తుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలతో కలిసి పని చేస్తుంటారు. హీరోలకి ఉన్నంత లాంగ్ కెరియర్ హీరోయిన్స్‌కి ఉండదు కాబట్టి క్రేజ్ ఉన్నంత కాలం క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటారు.
Senior Actresses | దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని హీరోయిన్స్ బాగా నమ్ముతారు. వారి క్రేజ్ ఉన్నన్ని రోజులు వరుస పెట్టి సినిమాలు చేస్తుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలతో కలిసి పని చేస్తుంటారు. హీరోలకి ఉన్నంత లాంగ్ కెరియర్ హీరోయిన్స్‌కి ఉండదు కాబట్టి క్రేజ్ ఉన్నంత కాలం క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటారు. తాజాగా ముగ్గురు సీనియర్ భామలు పాత ఛరిష్మాతో అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ఎలాంటి పాత్ర వచ్చినా నో చెప్పకుండా నటిస్తున్నారు. మరి ఆ భామలు మరెవరో కాదు కాజోల్, టబు, రాణీ ముఖర్జీ, విద్యా బాలన్, కరీనా కపూర్ తదితరులు.
మేటి నాయకులతో పోటీ పడి మరి అవకాశాలని అందిపుచ్చుకుంటున్న ఈ భామలు నిజంగా గ్రేట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టబు వయస్సు 50 ఏళ్లు దాటినా కూడా బోల్డ్ అండ్ రొమాంటిక్ పాత్రల విషయంలోనూ ఏమాత్రం రాజీ పడకుండా నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన `హౌస్ ఫుల్ 5`తో అదరగొట్టింది. అందులో ఈ అమ్మడి పాత్రకి మంచి మార్కులే పడ్డాడు. ఇక ఇప్పుడు `బూత్ బంగ్లా`లో నటిస్తోంది. అలాగే విద్యాబాలన్ విషయానికి వస్తే `భూల్ భులయ్య 3` తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ కమిట్ అయిన కొన్ని చిత్రాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి. వాటితో త్వరలో పలకరించనుంది.
ఇక కాజోల్ కూడా దూకుడు చూపిస్తోంది. లస్ట్ స్టోరీస్ -2 , దో పత్తి , `మా `లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. ఇటీవల రిలీజ్ అయిన హౌస్ ఫుల్ 5 లోనూ నటించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ప్రస్తుతం క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో నటిస్తోంది. అలాగే సర్జమీన్ అనే సినిమాకు కమిట్ అయింది. ఈ సినిమాలతో రానున్న రోజులలో తెగ సందడి చేయనుంది. ఇక రాణీ ముఖర్జీ విషయానికి వస్తే గత రెండేళ్లగా ఖాళీగా ఉన్నా ఆ గ్యాప్ ను ఒకే ఏడాదిలో భర్తీ చేసేలా దూసుకుపోతుంది.. ప్రస్తుతం కింగ్ , మర్దానీ 3 చిత్రాలలో నటిస్తోంది. మర్దానీ హిట్ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతున్న థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ చిత్రంపై అంచనాలు అయితే ఓ రేంజ్లో ఉన్నాయి. మొత్తానికి సీనియర్ బ్యూటీలు ఇప్పుడు వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

