నారా రోహిత్ హీరోగా రూపొందుతున్న పోలీస్ నేపథ్య సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘కపాలి’. హన్సిక మోత్వాని కథానాయిక. రామ్ గన్ని దర్శకుడు. కల్యాణచక్రవర్తి మంథినా, భానుకిరణ్ ప్రతాప నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని మేకర్స్ ఆనందం వెలిబుచ్చుతున్నారు.
ఆదివారం కథానాయిక హన్సిక మోత్వానీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న హన్సికను ఈ పోస్టర్లో చూడొచ్చు. ఈ కథలో ఆమె పాత్ర ప్రాధాన్యతను ఈ స్టిల్ తెలియజేస్తున్నది. ఆమె చుట్టూ ఉన్న మిస్టీరియస్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి నిర్మాణం: సప్త అశ్వ మీడియా వర్క్స్