చెన్నై: బీహార్ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని మోదీ తన పదవికి ఉన్న గౌరవాన్ని మరచిపోయి ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం విమర్శించారు. బీహార్ నుంచి తమిళనాడు వచ్చిన ప్రజలను డీఎంకే ప్రభుత్వం వేధిస్తోందంటూ బీహార్‌లోని ఛంపాలో గురువారం మోదీ చేసిన ప్రసంగం వీడియో క్లిప్‌ని ఎక్స్‌లో పోస్టు చేసిన స్టాలిన్..
భారతదేశ పౌరులందరికీ సేవ చేసే పదవిలో తాను ఉన్నాను అన్న విషయాన్ని మోదీ తరచూ మరచిపోతుంటారని వ్యాఖ్యానించారు. అటువంటి ఉపన్యాసాలతో ప్రధాని తన పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చవద్దని ఆయన కోరారు.