న్యూఢిల్లీ: హెచ్-1బీ వీసా దరఖాస్తు వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన దాడిని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఒక బలహీనమైన నేత అని లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
‘నేను మళ్లీ చెబుతున్నాను. భారత దేశానికి బలహీనమైన ప్రధాని ఉన్నారు’ అని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. మోదీ విదేశాంగ విధానాన్ని ఆలింగనాలు, శుష్క నినాదాలు, బిగ్గరగా మాట్లాడే స్థాయికి తగ్గించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు.