Narendra Modi : ‘ఆపరేషన్ సిందూర్’పై లోక్‌సభలో రెండో రోజు చర్చలు వాడీవేడీగా సాగాయి. ప్రతిపక్షం సంధించిన ప్రశ్నలకు ప్రధాన పక్షమైన మోడీ బృందం దీటుగా బదులిచ్చింది. మంగళవారం జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) సహా హోం మత్రి అమిత్ షా ప్రతిపక్షాల అభ్యంతరాలను కొట్టిపారేశారు. సభ్యులందరి సమక్షంలో కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమేయం లేదని మోడీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిందని ప్రధాని తెలిపారు.’ దయచేసి దాడులు ఆపండి’ అని పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓను వేడుకోవడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించామని సభకు మోడీ వివరించారు.
భారత్, పాకిస్థాన్ యుద్ధం విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర లేదని ప్రధాని ధైర్యంగా చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. మోడీకి దమ్ముంటే ట్రంప్ అబద్ధాలకోరు అని సభా వేదికగా చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత సవాల్‌ను స్వీకరించిన మోడీ తమకు యుద్ధం ఆపాలని ఏ దేశాధినేత చెప్పలేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనకు మూడు నాలుగు సార్లు కాల్ చేసి.. పాక్ భారీ దాడికి సిద్ధమవుతోందని హెచ్చరించారని మోదీ అంగీకరించారు. కానీ, తాను మాత్రం మేము పాక్‌కు దీటుగా బదులిస్తామని ఆయనతో చెప్పినట్టు ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచం మద్దతు తమకు లభించిందని, కానీ కాంగ్రెస్ మద్దతు లభిచండం లేదని మోడీ అన్నారు. అంతేకాదు ఆ పార్టీ కారణంగానే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కోల్పోయామని ఆయన విమర్శించారు. పీఓకే ఒక్కటే కాదు సింధు జలాల ఒప్పందం కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, మాజీ ప్రధాని నెహ్యూ పాకిస్థాన్‌కు డ్యాంలు కట్టుకునేందుకు డబ్బులు కూడా పంపారని మోడీ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణి వ్యవస్థను పటిష్టం చేశామని ప్రధాని సభికులకు తెలియజేశారు.
नरेंद्र मोदी लगातार लड़खड़ा रहे हैं,#RahulGandhi राहुल गांधी ने उन्हें युद्धविराम #Ceasefire पर डोनाल्ड ट्रंप #trump का नाम लेने के लिए फँसा दिया है। मोदी बार-बार पानी पी रहे हैं! 😂
मुझे आज संसद में मोदी जी के भाषण का हर पल बहुत पसंद आ रहा है 😂🔥 #ParliamentSession pic.twitter.com/jGKCLJ4lDE
— ShatruGhan Sinha 🇮🇳 (@ShatrughanAITC) July 29, 2025
ఆపరేషన్ సిందూర్‌తో దాయాదికి భారత్ మూడు విషయాల్ని చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చేసిందని మోడీ అన్నారు. ఒకవేళ భారత్‌పై ఉగ్రదాడికి పాల్పడితే.. మేము మాదైన స్టయిల్లో.. సమయం చూసుకొని బదులిస్తాం. మా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని పాక్ చేసే బ్లాక్ మెయిల్స్‌కు మేము వెరవం. ఇక మూడోది.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాన్ని.. ఉగ్రవాదులను మేము వేర్వేరుగా చూడము అని మోదీ పేర్కొన్నారు.