దేవరకొండ రూరల్, జూలై 29 : గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ విషాద సంఘటన దేవరకొండ రూరల్ మండలంలోని ముదిగొండ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. మండలంలోని ముదిగొండ గ్రామానికి చెందిన నల్ల ప్రదీప్ (32) హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం విధులు ముగించుకుని గ్రామానికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. ప్రదీప్ ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నాడు.