Mock Drills | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అన్న అంశంపై అవగాహన కల్పించాలని కేంద్రహోం శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో బుధవారం దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో సెక్యూరిటీ డ్రిల్స్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ (Security Mock Drills) ప్రారంభమయ్యాయి. మొత్తం 244 జిల్లాల్లోని 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
#WATCH | Pune: A comprehensive Civil Defence Mock Drill is being conducted at Council Hall, Pune City.
MHA has ordered a nationwide mock drill today. pic.twitter.com/u8KsO558Uk
— ANI (@ANI) May 7, 2025
ఈ మాక్ డ్రిల్స్‌లో అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ/ ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువకేంద్రాలు, కళాశాలలు/ పాఠశాలల విద్యార్థులను భాగస్వాముల్ని చేయనున్నారు. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయరక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పిస్తున్నారు.
ఏమిటీ సెక్యూరిటీ డ్రిల్?
సెక్యూరిటీ మాక్ డ్రిల్ అనేది ఒక రక్షణకు సంబంధించిన శిక్షణ ప్రక్రియ. రక్షణ వ్యవస్థ పనిచేస్తున్నదా లేదా అని పరీక్షించి, భవిష్యత్తులో ప్రాణనష్టం జరగకుండా ముందస్తుగా ప్రతిస్పందించడానికి అనుసరించే మార్గం. ప్రమాదం జరుగడానికి ముందే.. ఆ ప్రమాదానికి ఎలా ప్రతిస్పందించాలో ప్రాక్టీస్ చేయడంగా దీనిని పేర్కొనవచ్చు.
ఎందుకు నిర్వహిస్తారు?
ప్రజలలో అప్రమత్తత కల్పించడానికి, సిబ్బంది వెంటనే స్పందించి, నైపుణ్యతతో పరిస్థితులను చక్కదిద్దడానికి, సాంకేతిక లోపాలను ముందుగా గుర్తించి సరిచేసుకోవడానికి, ఎమర్జెన్సీ సమయంలో ప్రతిస్పందన బృందాలు సమన్వయంతో ఏ మేరకు పనిచేయగలవో పరీక్షించడానికి ఈ డ్రిల్‌ను నిర్వహిస్తారు.
ఏ సమయాల్లో డ్రిల్ చేపడతారు?
యుద్ధం, ఉగ్రదాడులు, బహుళ అంతస్తుల భవనాలు-దవాఖానల్లో అగ్నిప్రమాదం, భూకంపం, వరదలు, తుఫాన్లు, కెమికల్ లీకేజీ వంటి సందర్భాల్లో సాధారణంగా ఈ డ్రిల్‌ను నిర్వహిస్తారు. ఆయా వ్యక్తులు, సంస్థలకు ముందుగా తెలిపి కానీ, తెలపకుండా హఠాత్తుగా గానీ ఈ డ్రిల్స్‌ను నిర్వహిస్తారు.
1971 యుద్ధ సమయంలో ఇలా..
దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసమని భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పౌరుల భద్రత కోసమని అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ డ్రిల్స్‌ను నిర్వహించింది. యుద్ధ సమయంలో సాయంత్రం 6.30 కల్లా ప్రతిఒక్కరూ ఇండ్లకు చేరుకొనేవారు. సైరన్ వినిపించగానే ప్రతీ ఒక్కరూ లైట్లు ఆర్పేసి ఇండ్లల్లో సురక్షిత ప్రదేశాల్లో దాక్కొనేవారు. నేలపై పడుకొనేవారు. చెవులను గట్టిగా మూసుకొనేవారు. ఆ సమయాల్లో పెద్దగా మాట్లాడటం కూడా ఉండేది కాదు. పాక్ సేనలు తాజ్‌మహల్‌పై దాడులకు పాల్పడే ప్రమాదమున్నదన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆ కట్టడం శత్రువు కంటపడకుండా పరిసరాల్లో కలిసిపోయేట్టు కనిపించడానికి దానిపై ఆకుపచ్చటి జూట్ వస్ర్తాన్ని (కేమోఫ్లాజ్ వస్త్రం) కప్పారు.
#WATCH | Mumbai, Maharashtra: A mock drill is being carried out at Mumbai’s Cross Maidan.
MHA has ordered a nationwide mock drill today. pic.twitter.com/907WmftjEL
— ANI (@ANI) May 7, 2025
Also Read..
PM Modi | ఆపరేషన్ సిందూర్ దేశానికి గర్వ కారణం.. క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ
Scalp, Hammer | స్కాల్ప్, హామర్.. ‘ఆపరేషన్ సిందూర్’లో భారత్ వినియోగించిన ఆయుధాలు ఇవే
Rare Ayurvedic Manuscripts : అరుదైన ఆయుర్వేద మాన్యుస్క్రిప్ట్‌ల పునరుద్ధరణ