PM Modi : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున భారత బలగాలు (Indian forces) చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) దేశానికి గర్వకారణమని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సేనలు దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చడం దేశానికి గర్వకారణమని ప్రధాని అన్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ గురించి సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా.. భారత సేనలు చేపట్టిన చర్యను క్యాబినెట్‌లోని మంత్రులంతా బల్లలు చరిచి సమర్థించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సేనలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ నిర్వహించాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ఆమెకు సమాచారం ఇచ్చారు.