Mobile internet services | జార్ఖండ్ (Jharkhand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శని, ఆదివారాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను (recruitment test) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలో ఈ నెల 21, 22 తేదీల్లో (ఇవాళ, రేపు) జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (Jharkhand General Graduate Level Combined Competitive Examination) పరీక్షలు జరగనున్నాయి. దాదాపు 823 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతండగా.. 6.39 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే, ఇటీవలే నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీని దృష్ట్యా రాష్ట్రంలో తాజాగా నిర్వహిస్తున్న పోటీ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో రోజుకు దాదాపు ఐదు గంటల పాటు ఈ సేవలు బంద్ కానున్నాయి. రెండు రోజులూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది.
Also Read..
Khairatabad Ganesh | ఖైరతాబాద్ మహా గణపతి అవశేషాల తొలగింపు.. ఫొటోలు వైరల్
Shubman Gill: శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ