చెన్నై: శుభమన్ గిల్(Shubman Gill) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను హాఫ్ సెంచరీ బాదాడు. టెస్టుల్లో అతనికి ఇది ఏడవ అర్థ సెంచరీ. గిల్, పంత్ మధ్య.. భారీ భాగస్వామ్యం ఏర్పడింది. హాఫ్ సెంచరీకి ముందు గిల్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఇవాళ ఆట మూడవ రోజు కావడంతో.. మ్యాచ్‌పై భారత్ పూర్తిగా పట్టు సాధించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇండియా లీడింగ్‌లో ఉన్నది. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 149 రన్స్‌కు ఆలౌటైంది. ఇండియా ఆధిక్యం 350 పరుగులు దాటింది. క్రీజ్‌లో గిల్, పంత్ ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా ప్రస్తుతం 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది.
5⃣0⃣ partnership comes up for the 4th wicket 👌👌
Shubman Gill 🤝 Rishabh Pant
Live – https://t.co/jV4wK7BgV2#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/iGM3NrTIWg
— BCCI (@BCCI) September 21, 2024