లక్నో: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఉన్నట్టుండి అతడి ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. ఆ తర్వాత అది పేలిపోయింది. (Mobile Explodes) దీంతో ఆ వార్డులో ఉన్నవారంతా భయాందోళన చెందారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం అవినాష్ పాల్ అనే వ్యక్తి బైక్పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతడ్ని కొత్వాలి ప్రాంతంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి స్థానికులు తరలించారు.
కాగా, ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న అవినాష్ పాల్ ప్యాంటు జేబులో ఉన్న మొబైల్ ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే అది పేలిపోయింది. ఆ వార్డులో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న రోగులు, ఇతర వ్యక్తులు భయాందోన చెందారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన ఆ హాస్పిటల్లో కలకలం రేపింది.
Also Read: